JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి పుష్కర స్నాన ఘట్టాలను, పరిసర ప్రాంతాలను జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాబోవు గోదావరి పుష్కరాల కోసం భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులతో చర్చించారు. అనంతరం పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు.