BHNG: భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా, ఆమె చిత్రపటానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.