MDK: తూప్రాన్ పట్టణంలో బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని పాత హైవే రోడ్డుపై తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులతో పాటు కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.