‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్‌తో ’96’ దర్శకుడు ప్రేమ్ కుమార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో తనదైన ఎమోషన్ కంటెంట్‌ను నింపేందుకు దర్శకుడు రెడీ అవుతున్నారట. ఈ మేరకు ఫహాద్‌కు కథను వినిపించగా.. ఆయన ఓకే చెప్పారట. 2026లో ఇది సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.