W.G: ఇరగవరంలో అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మిషన్ శిక్షణ, వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన ఒకేషనల్ ట్రైనింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్ అరుణకుమారి, కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.