SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్ట్‌కు 3126 క్యూసెక్కులు వరద కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు AEE జాన్ స్టాలిన్ బుధవారం తెలిపారు. గతవారంతో పోల్చుకుంటే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. గత 3 వారాలు నిరంతరంగా, వరద ఉధృతిని బట్టి ప్రాజెక్టు గేట్లను తెరిచి దిగువకు విడుదల చేశారు. ఇప్పుడు ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. నీటిమట్టం 29.917 టీఎంసీలు కాగా 16.427 టీఎంసీల వద్ద నిలువ ఉంది.