NLG: డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతోందన్నారు.