NTR: విజయవాడలోని ఎర్రకట్ట వద్ద మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం తాగి కూర్చునే క్రమంలో ఓ వ్యక్తి గుంటలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు.