RR: బడుగు వర్గాల బలమైన శక్తిగా, పోరాట యోధురాలుగా చాకలి ఐలమ్మ చరిత్ర చిరస్మరణీయమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ లాంటి నిస్వార్థ నాయకులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.