NLG: మిర్యాలగూడ పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వెట్టి చాకిరి విముక్తి నుంచి నిజాం రాజులను ఎదిరించిన మహిళా యోధురాలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు రవి నాయక్, శీను గౌడ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.