GNTR: ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా ఆటో డ్రైవర్స్ & వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై కూటమి నేతలు మౌనంగా ఉండటంపై ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.