VZM: రాజాం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంతకుమార్ బుధవారం తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఏదైనా పీజీ చదివి వయసు 18-35లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు. 12 బహుళజాతి కంపెనీలు జాబ్ మేళాకు హాజరవుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు వినియోగించుకోవాలన్నారు.