అన్నమయ్య: మదనపల్లె పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రేమ్ తేజ ఆచారి రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర స్థాయి ఐఆర్ఎస్ఎఫ్ మాస్టర్ ఈవెంట్లో స్పీడ్ స్ప్రింట్, డబల్ అండర్, స్పీడ్ డబుల్ రిలే విభాగాల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి మూడు బంగారు పథకాలను సాధించినట్లు కళాశాల ఛైర్మన్ నిర్మల్ కుమార్ రెడ్డి తెలిపారు.