KMR: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాక్షిక తనిఖీలో భాగంగా మంగళవారం సాయంత్రo కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా కేంద్రంలోని ఎలక్షన్ గోడౌన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎలక్షన్ గోడౌన్లో ఈవీఎంలను భద్రపరిచిన గదులను తెరిచి EVM బాక్సులను పరిశీలించి మళ్లీ గదులను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.