KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు బుధవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ సేవ అనంతరం స్వామివారి మొదటి దర్శనం చేసుకున్నారు. స్వామివారి సన్నిధిలో తాము ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించామని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జీవితంలో మరపురాని అనుభూతిగా భావిస్తున్నామన్నారు.