కృష్ణా: నాగాయలంక ఆరో వార్డుకు చెందిన చుండూరు మణి కుమారి 1661 బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కోరిక మేరకు కూతురు, అల్లుడు, మనుమరాళ్ల సహకారంతో నేత్రాలను దానం చేశారు. గతంలో మృతురాలి భర్త ప్రసాద్ కూడా నేత్రదానం చేశారు. విజయవాడలోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్య బృందం కళ్లను సేకరించినట్లు సుదర్శి మానవతా సేవా సంస్థ ప్రతినిధులు తెలిపారు.