ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమావేశాన్ని ఎంపీడీవో వీరభద్రాచారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగంతో పంట దిగుబడి సాధించవచ్చని అన్నారు. అలాగే యూరియా కొరత లేకుండా చూసుకోవాలని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మరియు అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.