కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి మంగళవారం ఒక్కరోజు రూ. 7.47 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఆది, మంగళవారాల్లో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.