»Kedarnath Temple To Be Opened In Uttarakhand Devotees Flocked
Kedarnath Temple: తెరుచుకునున్న కేదార్నాథ్ ఆలయం.. పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయం ఈరోజు తెరుచుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబంతో సహా తొలిపూజ నిర్వహించారు. ఇక దేశ నలుమూలల నుంచి భక్తులు కదలి వచ్చారు.
Kedarnath Temple to be opened in Uttarakhand.. Devotees flocked
Kedarnath Temple: దేశంలోని శివాలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో కేదార్నాథ్ పుణ్యక్షేత్రం ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది. గత ఆరు నెలలుగా మూసి ఉన్న ఈ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య నేడు ఉదయం 7 గంటలకు అధికారులు తలపులు తెరిచారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం కూడా ఒకటి. ప్రతీ సంవత్సరం లక్షాలది మంది భక్తులు చార్ధామ్ యాత్రకు వస్తారు. అందులో భాగంగా కేదార్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకుంటారు. దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం పరమేశ్వరుడి దర్శనం కోసం కేదార్‌నాథ్‌కు వస్తుంటారు. మంచు ఎక్కువగా కురుసే శీతాకాలంలో ఈ ఆలయాన్ని ఆరు నెలల పాటు మూసివేస్తారు. తరువాత ఆరునెలల పాటు ఈ ఆలయానికి పూజలు నిర్వహిస్తారు. ఇక నేడు 40 క్వింటాళ్ల పువ్వులతో దేవలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ రోజు ఉదయమే యమునోత్రి ఆలయం తెరుచుకుంది. ఇక మధ్యాహ్నం 12:20 గంటలకు గంగోత్రిఆలయం తెరుచుకోనుంది. అలాగే చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు
అధికారులు తెలిపారు.