Gold and Silver Rates Today : అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ డిమాండు నేపథ్యంలో శుక్రవారం పసిడి ధరలు భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.915 పెరిగి రూ.74,770కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన పట్టణాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,770గా కొనసాగుతోంది. ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవని గుర్తుంచుకోవాలి. కొనుగోలుదారులు నగల్ని కొనుగోలు చేస్తున్నప్పుడు జీఎస్టీ, మజూరీల్లాంటివి అదనంగా తోడవుతాయని గమనించుకోవాలి.
ఇక అక్షయ తృతీయ రోజు వెండి ధరలు ఏకంగా రెండు వేలకు పైగా పెరిగాయి. దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) నేడు రూ.2,172 పెరిగి రూ.86,432కు చేరుకుంది. విశాఖపట్నం, ప్రొద్దుటూరు. హైదరాబాద్, విజయవాడ ల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పండుగ రోజు వెండి, బంగారం రెండూ కూడా భారీగా పెరగడం గమనార్హం.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. పసిడి ధర నేడు 35 డాలర్లు పెరిగి 2352 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్సు వెండి ధర ప్రస్తుతం 28.38 డాలర్లుగా ఉంది.