»Horoscope Today Todays Horoscope 2024 April 10th Astrology
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 April 10th).. ధనలాభం ఉంటుంది.
ఈ రోజు(2024 April 10th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మొదలు పెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు.
వృషభం
విదేశాలకు వెళ్లాలనే మీ కల నిజం అవుతుంది. కుటుంబంలో గొడవలు ఉంటాయి. ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల పట్ల శ్రద్ధ అవసరం. మీమీరంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం
శుభకార్యాల్లో పాల్గొంటారు. మీమీగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. సన్నిహితులను కలవడంలో విఫలమవుతారు. ఎక్కవు ఆలోచించడం వలన ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు చేస్తారు. స్త్రీల వలన ధనలాభం ఉంటుంది.
కర్కాటకం
అనుకోకుండా ధననష్టం కలిగే అవకాశం ఉంది. ఆస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇతరుల మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వ్యక్తులకు ఆందోళన ఉంటుంది. కొత్తగా మొదలు పెట్టే పనులు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం
ధైర్యం కోల్పోకుండా ఉండాలి. కొత్తగా మొదలు పెట్టిన పనులకు ఆటంకాలేర్పడతాయి. కోపం అంత మంచిది కాదు. మృదువుగా మాట్లాడటానికి ప్రయత్నించండి మంచి ఫలితాలు కలుగుతాయి. తోటి వారికి మంచి చేయండి.
కన్య
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు పొందుతారు. ఇతరులకు మీరు ఆదర్శంగా ఉంటారు. సన్నిహితులను కలుస్తారు.
తుల
సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడుంది. ధన నష్టం ఉంది. తద్వారా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతారు. అనారోగ్య బాధలు వేదిస్తాయి. పైఅధికారుల పట్ల జాగ్రతగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.
వృశ్చికం
ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఎంచుకున్న రంగంలో విజయాన్ని సాధిస్తారు. శత్రువులు అంటూ ఎవరు ఉండరు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ధన లాభాలు ఉంటాయి.
ధనుస్సు
కుటుంబంలో కలహాలు ఏర్పడుతాయి. అశుభవార్త వింటారు. ధననష్టం ఏర్పడుతుంది. మనస్తాపానికి లోనౌతారు. ప్రయాణాల్లో అప్రమత్తత ఎంతో అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాలి.
మకరం
కుటుంబ కలహాలు ఉండవు. ప్రశాంతంగా ఉంటారు. మొదలు పెట్టిన పనులు సాఫీగా సాగవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం . చెడు పనునలకు దూరంగా ఉండాలి. మంచి వారితో స్నేహం చేయాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
కుంభం
సమజాంలో మంచి గౌరవం పొందుతారు. వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళన చెందుతారు. సన్నిహితులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండడం మంచిది.
మీనం
దగ్గరవారితో కలహం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు తగ్గించుకోవాలి. కుటుంబ విషయాల పట్ల ఆందోళనగా ఉంటారు. స్త్రీలు అలిసిపోతారు.