»Horoscope Today Todays Horoscope Results 2024 July 16th
Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 July 16th).. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ఈ రోజు(2024 July 16th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
స్వల్పంగా అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రారంభించిన అన్ని పనుల్లో విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన పని పూర్తికావడంతో ఆనందిస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు మెండుగా లభిస్తాయి.
వృషభం
మంచి విషయం మీ చెవిలో పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. మానసిక ఆందోళనలు ఉన్నాయి. ఇంటిలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
మిథునం
ఇతరులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి. వ్యాపారంలో ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ. వృధా ప్రయాణాలు ఉన్నాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు విశ్రాంతి తీసుకోవాలి.
కర్కాటకం
వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. డబ్బు ఖర్చకు వెనకాడరు. కొన్ని ఆందోళనలు ఉన్నాయి. విదేశయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం.
సింహం
స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఇంటి పనులపై శ్రద్ధ పెడుతారు. అనుకోని ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. భక్తిశ్రద్ధలు పెరుగుతాయి.
కన్య
కుటుంబపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో మంచిపేరును తెచ్చుకుంటారు. మీరు చేసే పనులకు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు.
తుల
సమాజంలో గౌరవంగా ఉంటారు. అన్ని ప్రయత్నాలు సఫలమవుతారు. కుటుంబపరిస్థితులు కాస్త ఆందోళనకరంగా ఉంటాయి. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. మీమీ రంగాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృశ్చికం
ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. ప్రారంభించిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గౌరవిస్తారు. శత్రుబాధలు ఉండవు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. మనసుకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.
ధనుస్సు
వృత్తిరీత్యా కొన్ని ప్రదేశాలకు వెళ్తారు. ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు ఉన్నాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి.
మకరం
కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కొన్ని పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వలన అలిసిపోతారు. చెడు
వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండాలి.
కుంభం
కోరుకునేది జరగదు. మరోకటి జరుగుతోంది అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య బాధలు ఉన్నాయి. సమయానికి భోజనం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. చంచలం వలన కొన్ని సమస్యలు ఉన్నాయి. పిల్లల పట్ల జాగ్రత్త అవసరం.
మీనం
కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్ని పనుల్లో ఓర్పు, సహనం మంచిది. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. స్వల్ప అనారోగ్య బాధలు ఉన్నాయి.