GNTR: పెదకాకాని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పంపిణీ చేశారు. రూ. 4,86,977 విలువైన తొమ్మిది చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారులు చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.