VZM: ఈ నెల 9న బొండపల్లి తహసీల్దారు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు స్దానిక MRO డోల రాజేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఔత్సాహికులు స్వచ్ఛందంగా రక్తదానం చేసే ప్రాణదాతలు కావాలని కోరారు. రక్తదానం చేయడంతో ఆపదలో ఉన్న వారిని కాపాడిన వారవుతారని తెలిపారు. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తనిల్వలు సేకరించడం జరుగుతుందన్నారు.