SRPT: మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ.. ఆయన మున్సిపల్ మేనేజర్ రాబిన్‌కు వినతిపత్రం అందజేశారు. గడచిన ఐదు సంవత్సరాల్లో చనిపోయిన వారి పేర్లు కూడా ఈ ఓటరు జాబితాలో పొందుపరిచారన్నారు.