TG: ఓ తండ్రి ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన నారాయణపేటలో జరిగింది. భార్య కాపురానికి రావట్లేదనే కోపంతో ఇద్దరు పిల్లలను తండ్రి శివరాములు ఉరేసి చంపాడు. మృతదేహాలను యాపల్ చెరువులో పడేశాడు. ఆ తర్వాత కరెంట్ తీగలు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించి విఫలమయ్యాడు. మళ్లీ పురుగులమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.