BPT: అద్దంకి నియోజకవర్గంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.10.94 కోట్లు మంజూరు చేసినట్లు సోమవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ నిధులతో అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లో రూ.7.92 కోట్లతో 22 కొత్త భవనాలు నిర్మించనున్నారు. రూ.3.02 కోట్లతో ఆగిపోయిన పాత పనులను పూర్తి చేసి పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.