W.G: పోలవరంలో సీఎం చంద్రబాబు ఈ నెల 7న పర్యటన వివరాలను జిల్లా అధికారులు వివరించారు. ఉదయం 10:40లకు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. 10:55 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యామ్, బట్రస్ గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కుడి కాలువ కనెక్టివిటీ పనులు, ప్రగతిని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:40లకు ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షిస్తారని వెల్లడించారు.