TG: హైదరాబాద్‌కు చెందిన గోడిశాల నిఖిత(27) అమెరికాలో హత్యకు గురైన ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘X’ వేదికగా స్పందించారు. నిఖిత కుటుంబం సికింద్రాబాద్‌లోని తార్నాకలో ఉంటోందని అన్నారు. ఆమె మృతి విషయం తెలియగానే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు సహకారం అందించాలని కోరినట్లు తెలిపారు.