SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి. గోవిందరావు సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ నిధులను రూ.110 కోట్లు మాయం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. జల్ జీవన్ పథకం నిధులను పాతపట్నం నియోజకవర్గంలో ఎక్కడ పనులు జరగకుండా, రూ.110 కోట్లు కనిపించకుండా పోయాయని అన్నారు.