అనంతపురంలో జనవరి 8 నుంచి 10 వరకు మూడవ మిల్లెట్ మేళా నిర్వహించనున్నారు. ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని నిర్వాహకుడు మల్లారెడ్డి తెలిపారు. పోలీస్ కళ్యాణ మండపంలో జరిగే ఈ వేదికలో 30 స్టాళ్లను ఏర్పాటు చేస్తామని, మహిళా రైతులు తమ అనుభవాలను పంచుకుంటారని అన్నారు.