WNP: వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మేఘారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మజీద్ చర్చిల అభివృద్ధి నిధులు, శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం, హాస్టళ్లకు సొంతభవనాలు, పెద్దమందడిలో వేరుశనగ పరిశోధన కేంద్రం, పెబ్బేరులో ఫిష్ ప్రాసెసింగ్ పనులు పూర్తిచేయాలని, వనపర్తికి స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేయాలన్నారు.