JN: నేడు జనగామకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. దీనికోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా జిల్లాలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం చేయనున్నారు. అలాగే ఓడిపోయిన నేతలకు దిశానిర్దేశం, మనోధైర్యాన్ని కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.