JN: స్టేషన్ ఘనపూర్(M)శివునిపల్లి హనుమాన్ గుడి పూజారి మోహన్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. DEC 31న దీపం పెట్టి వెళ్లిన ఆయన, శనివారం రాత్రి తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటం గమనించారు. బీరువా చూడగా.. సుమారు కిలో వెండి, 5 తులాల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.