WGL: రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో యూరియా కొనుగోలు సెంటర్ను నేడు ఎర్రబెల్లి సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు ఎర్రబెల్లి ఫోన్ చేసి రైతులకు సరిపడా యూరియాను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.