KRNL: భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ ఏపీ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. వాలిడేషన్ ఫ్లైట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర విమానాయానరంగంలో ఇది చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్‌పోర్టు ఎంతో దోహదపడుతుందని, ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారతాయని పేర్కొన్నారు.