ప్రకాశం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ త్రిపురాంతకం మండలంలోని దువ్వలి గ్రామంలో కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టనున్నట్లు తహశీల్దార్ కృష్ణమోహన్ ఆదివారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు దువ్వలి గ్రామంలోని సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించి రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. రైతులు తప్పకుండా పాల్గొనాలని కోరారు.