CTR: వెదురుకుప్పం మండలం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలని ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డా. యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం నిరసనదీక్ష చేపట్టారు. కార్వేటి నగరం, వెదురు కుప్పం మండలాల నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.