TG: పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. ‘విభజన సమయంలోనూ మనకు అన్యాయం చేసిందే కాంగ్రెస్. 11వ షెడ్యూల్లో పాలమూరు-రంగారెడ్డి పెట్టలేదు. ఉత్తమ్ కట్లుకథలు, రేవంత్ పిట్ట కథలు చెప్పారు. రాజకీయాల కోసం మేం PPT ఇవ్వడం లేదు. ఫజల్ అలీ కమిషన్ చెప్పినా వినకుండా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారు’ అని మండిపడ్డారు.