SRD: సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటల వరకు రక్తదాన శిబిరం జరుగుతుందని ఆయన చెప్పారు. రక్తదాన శిబిరంతో పాటు ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.