TG: రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ‘రెండేళ్లలో రూపాయి ఇవ్వకుండా కాళేశ్వరంపై కక్షగట్టారు. సొంత ప్రాంతానికే రేవంత్ ద్రోహం చేస్తున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన కంటే ఏడున్నరరెట్లు అధిక ఆయకట్టు తెచ్చాం. నాడైనా, నేడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ’ అని తెలిపారు.