ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై బీభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. ఇలా చేయడం ద్రిగ్భాంతికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడించారు.
Nirmala Sitharaman: Kejriwal's silence is shameful!
Nirmala Sitharaman: ఆప్ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై బీభవ్ కుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిపై ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మౌనం వహించారు. ఇలా చేయడం ద్రిగ్భాంతికి గురిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ అన్నారు. ఒక మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం సిగ్గుచేటన్నారు. తన ఇంట్లోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే కేజ్రీవాల్ ఒక్కమాట మాట్లాడకపోవడం ఏంటి? తగిన చర్యలు కూడా తీసుకోలేదన్నారు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలని తెలిపారు. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం సిగ్గు చేటన్నారు.
పోలీసులకు స్వాతి ఫిర్యాదు చేయడానికి కూడా రోజుల సమయం పట్టింది. దీని బట్టి చూస్తే ఆమెపై ఒత్తిడి ఉందనిపిస్తోందని సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు. బిభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిన్న ఢిల్లీ పోలీసు బృందం ఆమె ఇంటికి వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. తనకు ఎదురైన భయానక పరిస్థితి గురించి ఆమె వెల్లడించిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆమె వెల్లడించారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు పరీక్షలో తేలిందని వైద్యులు తెలిపారు.