కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు
రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని నిర్మలా తెలిపారు. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహాయం. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కు ప్రత్యేక నిధులు.
ఆంధ్ర ప్రదేశ్ వేనుకబడిన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ప్రకటన. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు.
రికార్డు సృష్టించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా. వ రుసగా ఆరు బడ్జెట్లు సమర్పించిన మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్ అధిగమించారు. నిర్మలా సీతారామన్ ఈరోజు వరుసగా ఏడో బడ్జెట్ను ప్రవేశపెట్టారు