AKP: జిల్లాలో ఈ ఏడాది పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో అప్పారావు నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు గురువారం కసింకోట ప్రైవేట్ స్కూల్లో ఎంఈవోలు, ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులతో 100 రోజుల ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనను గమనించాలన్నారు.