నెల్లూరు జిల్లాలో పల్లె పండగ పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. మార్చిలోపు లక్ష్యాలు పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 600 మినీ గోకులాలు, 1900 ఎకరాల్లో పండ్ల తోటలు, 1642 ఇంకుడు గుంతలు పూర్తయ్యాయి. రోడ్ల పనులు 80% జరిగాయని, గడువులోగా మిగతావి పూర్తి చేస్తామని పీడీ గంగాభవాని తెలిపారు.