TPT: సంక్రాంతి వేళ సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు విచ్చేస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. సోమవారం నుంచి పండుగ జరుపుకోనున్నారు. ఈ పర్యటనలో రూ.160 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కల్యాణి డ్యామ్‌కు కృష్ణా జలాల మళ్లింపు ప్రాజెక్టుకు శంకుస్థాపన, స్కిల్ డెవలప్మెంట్, 2,200 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు.