ప్రకాశం: దొనకొండలోని బీసీ బాయ్స్ హాస్టల్‌ను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాలకు వెళ్తున్న విద్యార్థులకు వార్డెన్ ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంతో లక్ష్మా నాయక్ అభినందనలు తెలిపారు. స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థులకు ఆయన పలు జాగ్రత్తలు తెలిపారు.