»I Am Very Happy That Prime Minister Narendra Modi Spoke Like That On The Stage Chiranjeevi
Chiranjeevi: స్టేజీపై ప్రధాని అలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది..చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా స్టేజ్‌పై చాలా సంఘటనలు చోటుచేసుకున్నాయి. చివర్లో ప్రధాని మోడీ, పవన్ కల్యాణ్, చిరంజీవిల చేతులను పైకి లేపీ విజయోత్సహాన్ని చూపించిన తీరు ఆ కార్యక్రమానికే హైలెట్. ఆ సందర్భంగా ప్రధాని చిరంజీవితో ఏం మాట్లాడాడో అని అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ విషయాన్ని చిరంజీవి మీడియాకు తెలిపారు.
I am very happy that Prime Minister Narendra Modi spoke like that on the stage..Chiranjeevi
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కేసరపల్లి వేదికగా జూన్ 12 న చంద్రబాబు, నూతన మంత్రులు సైతం ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు సంఘటనలు వీక్షకులు మనుసును దోచాయి. అందులో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం తరువాత చిరంజీవికి పాదాభివందనం చేసుకోవడం ముచ్చటగా ఉంటే, ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే వచ్చి పవన్, చిరంజీవి అన్నదమ్ములు చేతులను పట్టుకొని విజయోత్సాహాన్ని ప్రదర్శించడం ఆ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సందర్భంగా చిరంజీవితో పీఎం మోడీ ఏదో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయన ఎం చెప్పి ఉంటారు అని అందరూ అనుకున్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన చిరంజీవి ఆ రహస్యాన్ని అందిరికి తెలిపారు.
పవన్ కల్యాణ్ విజయం సాధించిన తరువాత మీ ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియోను చూశాను. చాలా ముచ్చటేసింది. ఆ వీడియోలో మీ అన్నదమ్ములు అనుబంధం చూస్తే హృదయం ఉప్పొంగింది. మీ కుటుంబం ప్రేమ, అప్యాయతలు దేశానికి ఆదర్శం. మన సంస్కృతి సంప్రాదాయాలను ప్రతిబింభించేలా మీ కుటుంబం ఉంది. మీ లాంటి వ్యక్తులు ఉన్నందుకు చాలా సంతోషం అని చెప్పినట్లు చిరంజీవి తెలిపారు. ఆ మాటలు వింటున్నప్పుడు తనలో తెలియని ఉత్తేజం, ఉద్వేగం వచ్చిందని చిరంజీవి తెలిపారు. దేశప్రధాని మన లాంటి వారి గురించి గుర్తుపెట్టుకొని మాట్లాడడం మాములు విషయం కాదు కాదా అది ఆయన గొప్పతనం అని తెలిపారు. ఇక సభ అనంతరం మోడీ చంద్రబాబు కుటుంబంతో, పవన్ కల్యాణ్ కుటుంబంతో కాసేపు మాట్లాడి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.