A new poster from Kalki on the occasion of Disha Patani's birthday
Disha Patani: కల్కి కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ట్రైలర్ విడుదలతో సినిమా ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేశారు కల్కి మేకర్స్. తాజాగా ఆ చిత్రం నుంచి మరో అప్టేట్ ఇచ్చారు. కల్కి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ దిశా పటానీ కొత్త పోస్టర్ విడుదల చేసింది. హ్యాప్పి బర్త్ డే రోక్సీ అంటూ అందాల భామ పోస్టర్ విడుదల చేశారు. దిశా పటానీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రైలర్ కట్లో దిశాను ఒక్క షాట్లో చూపించారు. భైరవా నీకు నువ్వంటేనే అందరికన్నా ఇష్టం అనే డైలాగ్ ఉంది. దాంతో తాను ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ అని అర్థం అయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్వీన్ కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898 AD కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది కచ్చితంగా తెలుగు చిత్రపరిశ్రమను మరో స్థాయికి తీసుకపోతుంది అనడంలో ఎలాంటి సంశయం లేదని తెలుస్తుంది. చూడాలి మరీ అందరి అంచనాలను ఏ మేరకు పూర్తి చేస్తుందో.