కృష్ణా: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు ఉన్న లింకులు బయటపడుతున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. పెనమలూరులోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక రోగి అయినటువంటి జోకర్ జోగి రమేష్ లేనిపోని ఆరోపణలు అన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తారనే భ్రమలో ఉన్నాడని అన్నారు. ఆయన అరెస్టుకి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.